Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' 2 వీక్స్ కలెక్షన్స్': తన ఆల్ టైం రికార్డు తానే బద్దలుకొట్టిన పవర్...

‘వకీల్ సాబ్’ 2 వీక్స్ కలెక్షన్స్’: తన ఆల్ టైం రికార్డు తానే బద్దలుకొట్టిన పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్, అన‌న్య‌ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ కథానాయిక పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటీవ్ టాక్ ఉండడంతో  వకీల్ సాబ్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. కాగా, ‘వకీల్ సాబ్’ సినిమా 2 వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం…
★ నైజాం- 24.25 కోట్లు
★ సీడెడ్- 12.84 కోట్లు
★ ఉత్తరాంధ్ర- 11.72 కోట్లు
★ ఈస్ట్ గోదావరి- 6.17 కోట్లు
★ వెస్ట్ గోదావరి- 7.19 కోట్లు
★ గుంటూరు- 7.09 కోట్లు
★ కృష్ణా- 4.91 కోట్లు
★ నెల్లూరు- 3.34 కోట్లు
★ ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ (మొత్తం కలెక్షన్స్)- 77.52 కోట్లు
★ రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.58 కోట్లు
★ ఓవర్సీస్- 3.84 కోట్లు
★ ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు- 85.17 కోట్లు షేర్
ఇదిలాఉంటే.. వకీల్ సాబ్ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఇప్పటి వరకు సినిమా 85 కోట్లు షేర్ వసూలు చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా వకీల్ సాబ్ నిలిచింది. అంతకుముందు అత్తారింటికి దారేది 81 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ సినిమాను దాటేసింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు