Home సినిమాలు 'వకీల్ సాబ్' లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

‘వకీల్ సాబ్’ లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్’‌. ఈ సినిమాను శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరామ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ‘వకీల్‌సాబ్‌’లో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌ నటించలేదని దర్శకుడు వేణుశ్రీరామ్‌ స్పష్టం చేశాడు. “ఇటీవల రామజోగయ్యశాస్త్రి, తమన్‌ నేనూ కలిసి వరుసగా ఈ చిత్ర ప్రమోషనన్స్ లో పాల్గొంటున్నాం. ద్వితీయార్థంలో ఓ సర్‌ప్రైజ్‌ ఉందని తమన్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో అందరూ.. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ లేదా అకీరా నందన్ అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ‘వకీల్‌సాబ్‌’లో ఎవరు అతిథి పాత్రలో నటించడం లేదు’ అని ఆయన వెల్లడించారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు