Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్: ఏకైక హీరోగా పవన్ రికార్డ్

‘వకీల్ సాబ్’ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్: ఏకైక హీరోగా పవన్ రికార్డ్

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా వకీల్ సాబ్ యూఎస్ ప్రీమియర్ షోలకు సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ యూఎస్ ప్రీమియర్ షోలు 296k డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది యూఎస్ లో ప్రీమియర్స్ వేసిన తెలుగు చిత్రాల్లో వకీల్ సాబ్ నెంబర్ అగ్రస్థానంలో నిలిచింది.
కరోనా ప్రభావంతో యూఎస్ లో తక్కువ థియేటర్స్ కి మేరమే అనుమతి ఉన్నప్పటికీ వకీల్ సాబ్ 226 సెంటర్స్ నుండి 296885 డాలర్స్ వసూలు చేసినట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వకీల్ సాబ్ దాదాపుగా 300k డాలర్స్ కలెక్షన్స్ సాదించడమనేది ఓ రికార్డ్ అనే చెప్పొచ్చు. అలాగే సినిమాకి సక్సెస్ టాక్ ఉంది కాబట్టి వీకెండ్స్ లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కాగా, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతి హాసన్ నటించగా.. అంజలి, అనన్య నాగేళ్ల, నివేదా థామస్ ముఖ్యపాత్రలు పోషించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు