Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' మూవీ రివ్యూ:

‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ:

నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు
నిర్మాతలు : దిల్‌రాజు, శిరీష్‌
దర్శకత్వం : శ్రీరామ్ వేణు‌
సంగీతం : తమన్
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పింక్‌’కు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ రూపుదిద్దుకుంది. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈచిత్రాన్ని నిర్మించారు. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.  ఈ క్రమంలో  ‘వకీల్‌సాబ్‌’ చిత్రం ఏప్రిల్ 9న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా మెప్పించారు? ఆయన రీఎంట్రీ ఎలా ఉంది వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
హైదరాబాద్ లో ముగ్గురు స్నేహితురాళ్లయిన పల్లవి (నివేదా థామస్), అనన్య (అనన్య), జరీనా (అంజలి) ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఒకరోజు అర్థరాత్రి వీరు ముగ్గురు పార్టీ ముగించుకొని ఇంటికి కారులో వస్తుండగా వీరికి ఓ ముఠా తారసపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో వాళ్లతో కలిసి ఓ ప్రాంతానికి వెళ్ళాల్సివస్తుంది.  ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఓ సంఘటన పల్లవి, అనన్య, జరీనా ఓ కేసులో చిక్కుకుంటారు. అది ఈ ముగ్గురి జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) ఆ అమ్మాయిల పక్షాన అండగా నిలబడుతాడు మరి ఈ ముగ్గురికి సత్యదేవ్ న్యాయం జరిగేలా చేశాడా ? సీనియర్ లాయర్ ప్రకాష్ రాజ్ (నందా)ను ఎదుర్కొన్నాడు ? అసలు సత్యదేవ్ గతమేంటి ? అనేదే మిగ‌తా చిత్ర క‌థ‌.
విశ్లేషణ:
పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాల్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం, అందులోనూ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్‌’ సినిమాని రీమేక్ చేయడం, పైగా ఈ చిత్రంలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే లాయర్ సత్య దేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ జీవించేశారు. ప్రత్యేకించి కోర్టు సన్నివేశాల్లో పవర్ స్టార్ నటించిన విధానం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.  హీరోయిన్ పాత్రలో శృతిహాస‌న్ ఉన్నంతలో ఆక‌ట్టుకుంది. పవన్ కళ్యాణ్- శృతి హాసన్ మధ్య వచ్చే చాలా సీన్స్ చక్కగా పండాయి. ఇక ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ హిందీలో ‘పింక్’ సినిమా ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించాడు. మూల కథ మార్చడానికి ఆయన సాహసం చేయలేదు. కాకపోతే ఉన్న కథలో కమర్షియల్ అంశాలు మరిన్ని జోడించి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను ఆయన తీర్చిదిద్దిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నివేదా థామస్ నటన
కథ, కథనం
నేపథ్య సంగీతం
మైనస్‌ పాయింట్స్‌:
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు
రేటింగ్: 3.5/5

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు