Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

‘వకీల్ సాబ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వకీల్ సాబ్’. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్‌‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కి రీమేక్‌ ఇది. అందులో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

కాగా, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అక్షరాల 120కోట్లు షేర్ రిటర్నులు సాధించాలని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. వకీల్ సాబ్ సినిమా 85 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఇక ఈ సినిమా థియేట్రికల్  నాన్ థియేట్రికల్ అన్ని కలిసి మొత్తంగా 155 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఇందులో 30 కోట్లు డిజిటిల్ అలానే శాటిలైట్ ద్వారా సంపాదించగా.. మిగతా మొత్తం థియేట్రికల్ రైట్స్ మీద వచ్చాయి. ఇక వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు 25 కోట్ల లాభం చేకూర్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అటు ఇటుగా రూ.120 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. కాని సినిమా కు పాజిటివ్ టాక్ వస్తే ఈ లక్ష్యం పెద్దదేమీ కాదంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు