పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ”వకీల్ సాబ్” చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించగా.. అంజలి – నివేద థామస్ – అనన్య నాగెళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా నుంచి మూడవ సాంగ్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ ప్రీ రిలీజు ఈవెంట్‌ని భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 3న యూసుఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా, దీనికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.