Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' తొలి వారం వసూళ్లు.. బాక్సఫీసు వద్ద పవర్ స్టార్ ప్రభంజనం!

‘వకీల్ సాబ్’ తొలి వారం వసూళ్లు.. బాక్సఫీసు వద్ద పవర్ స్టార్ ప్రభంజనం!

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఉగాది, అంబేద్కర్ జయంతి వరుస సెలవు దినాలు రావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. పెట్టిన పెట్టుబడిన తొలి రెండు రోజుల్లోనే రాబట్టిన వకీల్ సాబ్.. బ్రేక్ ఈవెన్‌ సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక వకీల్ సాబ్ తొలి వారం కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే..
★ తొలిరోజు-40.10 కోట్లు
★ రెండో రోజు – 17. 10 కోట్లు
★ మూడో రోజు – 16. 05 కోట్లు
★ నాలుగో రోజు – 6.00 కోట్లు
★ ఐదో రోజు – 11 కోట్లు
★ ఆరో రోజు – 10. 55 కోట్లు..
వకీల్ సాబ్ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 100. 75 కోట్లు సాధించినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమా తొలివారంలో మొత్తంగా రూ. 30 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. సీడెడ్‌లో రూ.15 కోట్లు.. ఉత్తరాంధ్రలో 12 కోట్లు పైనే రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు