Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' చూశాక పవన్ ను హగ్ చేసుకున్న ఎన్టీఆర్!

‘వకీల్ సాబ్’ చూశాక పవన్ ను హగ్ చేసుకున్న ఎన్టీఆర్!

‘వకీల్ సాబ్’ సినిమాతో మూడేళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాక్సాఫీస్ వద్ద భారీ  కలెక్షన్స్ రాబడుతున్నారు. తొలి రోజే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కరోనా ప్రభావం ఈ సినిమాపై పెద్దగా పడలేదని తాజా రిపోర్ట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమా నుంచి లో ఆసక్తికర వార్త  ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ను ఎదుర్కొనే పాత్రలో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే వార్తను వెల్లడించారు.

‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చూసిన తర్వాత ఎన్టీఆర్ వచ్చి పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్నారన్న విషయాన్ని వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ వకీల్ సాబ్ చూసారన్న విషయం తాను చెప్పకపోయినా ప్రకాష్ రాజ్ కారణంగా ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఇది విన్న మెగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు