Home సినిమాలు 'వకీల్ సాబ్' కోసం పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నాడంటే?

‘వకీల్ సాబ్’ కోసం పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నాడంటే?

కరోనా మహమ్మారి పెను విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితుల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం భారీ విజయం సాధించింది. అయితే కలెక్షన్లకు సంబంధించిన చిత్ర బృందం  ఇప్పటి వరకు ఎలాంటి లెక్కల్ని లీక్ చేయలేదు కానీ.. నిర్మాతలకు ఈ సినిమా భారీగానే లాభాలు తెచ్చిపెట్టిందని అంటున్నారు.  అయితే తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమాకు గాను పవన్ కళ్యణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని నెట్టింట్లో  ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే  ‘వకీల్ సాబ్ సినిమా’కు మొత్తంగా 65 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడట పవన్ కళ్యణ్. అందులో 50 కోట్లు ఆయన పారితోషికం కాగా… మిగతాది సినిమా బిజినెస్ లో పర్సెంటేజ్ అని సమాచారం. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్లకు క్లోజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ కళ్యణ్ తరువాత ప్రకాష్ రాజ్ కు పారితోషికంగా నిర్మాత దిల్ రాజు భారీ మొత్తాన్ని చెల్లించారట. హీరోయిన్ నివేదా థామస్‌కు రూ .75 లక్షలు, శృతి హాసన్‌, అంజలిలకు రూ .50 లక్షలు రెమ్యునరేషన్ గా అందించారట మేకర్స్. కాగా, శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మించారు. కాగా.. ఈ సినిమాతో పవన్‌కల్యాణ్‌ మూడేళ్ల తర్వాత మంచి హిట్‌ అందుకున్నారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు