Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఏకంగా రూ.32 కోట్ల షేర్, రూ.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే ఆల్‌ టైం రికార్డు కావడం విశేషం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపుగా రూ.1.82 కోట్లు, ఓవర్‌సీస్‌లో రూ.2.40 కోట్ల కలెక్షన్లు ఈ సినిమా వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ తొలి రోజే రూ.36.46 కోట్ల షేర్, రూ.52.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అయితే సినిమాకి తొలి రోజే మంచి టాక్ వచ్చింది పైగా పవన్ కళ్యాణ్ కు సరైన హిట్ కూడా వచ్చి చాలా కాలం అయ్యింది. కాబట్టి ఈ వీకెండ్ కి కూడా భారీ వసూళ్లు రాబట్టేయడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలాఉంటే.. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌గా, ఆయ‌న‌ను వెండితెర‌పై చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపించారు. శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ల్లి, కుటుంబ స‌భ్యుల‌తో ఏఎంబీ మాల్‌కు వెళ్లి మ‌రీ వ‌కీల్ సాబ్ సినిమాని వీక్షించారు.

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు