Home ప్రత్యేకం 'వకీల్ సాబ్' అరుదైన ఘనత: తన రికార్డును తానే బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్

‘వకీల్ సాబ్’ అరుదైన ఘనత: తన రికార్డును తానే బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్

వ‌కీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ముఖ్యంగా ఈ కార్య‌క్రమంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 11 గంటల దాకా సాగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అలాగే టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారమైన ఈ కార్యక్రమానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమాన్ని లైవ్ షో ద్వారా ప్రసారం చేసిన చానల్ కు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 1.30 లక్షల మంది లైవ్ ద్వారా వీక్షించారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ టీవీ వీక్షణల్లోనూ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు ఏ సినిమాకు ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదు.
కాగా, వకీల్ సాబ్ సినిమాకు ముందు లైవ్ షో లో టీవీ వీక్షణల్లో అంతకుముందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా రికార్డు సాధించింది . అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 1.28 లక్షల మంది  లైవ్ ద్వారా వీక్షించారు. ఇప్పుడు ఆ రికార్డును మూడు ఏళ్ళ  తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి తిరగరాశాడు. దీంతో పవర్ స్టార్ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ హీరోగా  వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న గ్రాండ్‌గా విడుదల  కానుంది. ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించగా.. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషించారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు