Home సినిమాలు 'వకీల్ సాబ్'లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో మాట్లాడుతాడు. నిజానికి టాలీవుడ్ లో అలాంటి భాష ఎక్కువగా వాడరు. కానీ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ మాత్రం  ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు తెలంగాణ భాష మాట్లాడుతూ ఉంటాడు.

అయితే దీనికేమైన ప్రత్యేక కారణం ఉందా అని తాజాగా  ఓ ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్ ను అడగగా… ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాస మాట్లాడటానికి ఎలాంటి ప్రత్యేకమైన కారణాలు లేవని పేర్కొన్నారు. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఈ సినిమాలో పవన్ తోనూ కూడా తెలంగాణ యాస మాట్లాడించారని చిత్రబృందం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘వకీల్‌సాబ్‌’లో పవన్‌ సత్యదేవ్‌ పాత్రలో కనిపించారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా కనిపించారు. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు