Home ప్రత్యేకం "వకీల్‌ సాబ్" ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

“వకీల్‌ సాబ్” ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పవన్‌కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్‌ తన పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తున్నారు. బోనీకపూర్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ స్పందించాడు. ‘బాబాయ్… మైండ్ బ్లోయింగ్. ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 1.35కోట్ల పైగా వ్యూస్‌, 9లక్షలకు పైగా లైక్స్‌ అందుకోని రికార్డులు సృష్టిస్తుంది.

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు