Home ప్రత్యేకం వకీల్‌ సాబ్‌ 'కంటిపాప..కంటిపాప’ సాంగొచ్చింది

వకీల్‌ సాబ్‌ ‘కంటిపాప..కంటిపాప’ సాంగొచ్చింది

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగ రోజే.. అయితే పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్‌’ సినిమాతో త్వరలోనే ఫ్యాన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే , ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది చిత్రబృందం. మొదటిపాట ‘మగువ..మగువ’.. రెండోది ‘సత్యమేవ జయతే’. అయితే తొలిపాటను 2020 మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలకాగా,  రెండో పాటను సరిగ్గా ఏడాది  తర్వాత 2021లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి రెండు కూడా ఇప్పటికే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. 

అయితే, తాజాగా ‘కంటిపాప..కంటిపాప’ అనే పాటను ఈ రోజు సాయంత్రం 5గంటలకు విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్‌ అంటే ఎంతో ఇష్టపడే రామజోగయ్య శాస్త్రి అంతే ఇష్టంగా ఈ పాటని రచించగా.. థమన్‌ ఈ పాటకు చక్కటి సంగీతాన్ని అందించారు. ఇక ఈ పాటలోని ఒక్కో లిరిక్‌ మనసును హత్తుకుంటుంది. కాగా, ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.​ హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతుందీ చిత్రం. శ్రుతి హాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. పవన్‌ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు