Home ప్రత్యేకం ‘వకీల్‌ సాబ్‌‌’ సెన్సార్ రిపోర్ట్.. బాక్సాఫీసు వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం!

‘వకీల్‌ సాబ్‌‌’ సెన్సార్ రిపోర్ట్.. బాక్సాఫీసు వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘వకీల్ సాబ్’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ నటించిన పింక్ సినిమాకు రీమేక్‌ ఇది. హిందీలో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్‌ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ నుంచి యు/ఏ లభించిందని తెలుపుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇదిలాఉంటే.. ఈ సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తోంది. 154 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ దుమ్మురేపాడని సెన్సార్‌ బోర్డ్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. కాగా,  దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు