Home సినిమాలు వంశీ పైడిపల్లితో పవర్ స్టార్ మూవీ ఫిక్స్!

వంశీ పైడిపల్లితో పవర్ స్టార్ మూవీ ఫిక్స్!

పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. నిర్మాత దిల్ రాజుకు బాగా లాభాలను తీసుకువచ్చింది. ఈ సినిమాకు గాను దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారు. అన్నింటికీ మించి పవర్ స్టార్ తో సినిమా చేయాలనేది దిల్ రాజు డ్రీమ్. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే.. ఇప్పటికి కల నెరవేరింది.

కాగా, దిల్ రాజు సినిమాని ప్రమోట్ చేసే విధానం.. సినిమా పట్ల ఆయనకున్న పేషన్ దగ్గర నుంచి చూసిన పవన్ కళ్యాణ్.. దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట. పవర్ స్టార్ మాటతో దిల్ రాజు ఆనందానికి అవధులు లేవట. దీంతో పవర్ స్టార్ కి సరిగ్గా సరిపోయే పవర్ ఫుల్ స్టోరీ కోసం.. దానిని కరెక్ట్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ కోసం చూస్తున్నారు. అయితే.. వంశీ పైడిపల్లి పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారని.. త్వరలో పవర్ స్టార్ కి వంశీ స్టోరీ నెరేట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. దిల్ రాజుతో వంశీకి మంచి అనుబంధం ఉంది. వంశీ తెరకెక్కించిన ఊపిరి సినిమా తప్పితే.. మిగిలిన సినిమాలన్నీ దిల్ రాజు బ్యానర్ లోనే చేసారు. దింతి ఖచ్చితంగా ఈ సినిమా సెట్ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు