Home క్రీడలు రోహిత్‌ శర్మపై అరుదైన రికార్డు నెలకొల్పిన నాథన్‌ లైయన్‌

రోహిత్‌ శర్మపై అరుదైన రికార్డు నెలకొల్పిన నాథన్‌ లైయన్‌

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా బరాక్,ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టు స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (44; 74 బంతుల్లో 6×4) మరోసారి నిరాశపరిచాడు.ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్‌ వేసిన 20వ ఓవర్‌ ఐదో బంతికి గాల్లోకి షాట్‌ ఆడిన అతడు మిచెల్‌ స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని రోహిత్ మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో మొత్తంగా 78 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి లైయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 


ప్రపంచ క్రికెట్ లోని అన్ని జట్ల బౌలర్లపై రోహిత్ శర్మ ఆధిపత్యం చెలాయిస్తుండగా.. అతన్ని అలవోకగా ఔట్ చేసేస్తూ నాథన్ లైయన్ తాజాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.రోహిత్ శర్మ కెరీర్‌లో ఇప్పటి వరకూ 33 టెస్టు మ్యాచ్‌లాడగా.. అతణ్ని ఏకంగా 6 సార్లు లైయన్ ఔట్ చేసేశాడు. మరే బౌలర్‌ కూడా ఈ తరహాలో రోహిత్ శర్మపై ఆధిపత్యం చెలాయించలేదు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడతో సమానంగా లైయన్‌ ఐదుసార్లు రోహిత్ ను ఔట్ చేయగా..తాజాగా ఔట్ చేయడంతో టీమిండియా ఓపెనర్ ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా ఈ లైయన్ రికార్డు సాధించాడు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు