Home సినిమాలు రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రవితేజ.. 68వ సినిమాకు అంత తీసుకుంటున్నారా?

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రవితేజ.. 68వ సినిమాకు అంత తీసుకుంటున్నారా?

‘క్రాక్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేశారు మాస్‌ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెప్పేశారు. శరత్ మండవ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడు రవితేజ. ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించబోతోంది. అయితే ఈ సినిమాకు రవితేజ కేవలం 30 రోజులే కేటాయించాడట. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేయడంతో పాటు షూటింగ్ ను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ మొత్తం సిద్ధమైపోయిందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఇక ఈ చిత్రానికి ర‌వితేజ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా టాక్ ప్ర‌కారం ర‌వితేజ ఈ మూవీకి రూ.8 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడ‌ట‌. అలాగే వైజాగ్, నైజామ్ ఏరియా రైట్స్ లో యాభై శాతం వాటా అడుగుతున్నాడట.  దింతో అన్ని కలుపుకొని రవితేజ పారితోషికం రోజుకు పాతిక లక్షలకుపైగా ఉండనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శరత్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. సంగీతం సామ్‌ సీఎస్‌ అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు