Home సినిమాలు రెమ్యునరేషన్‌‌ బీభత్సంగా పెంచిన నాని.. మరీ అంతా!

రెమ్యునరేషన్‌‌ బీభత్సంగా పెంచిన నాని.. మరీ అంతా!

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గ‌ర‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. కెరీర్ గ్రాఫ్ ప‌డిపోతేనో, ఫెయిల్యూర్స్ ఉంటేనో త‌ప్ప రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌రు. టాలీవుడ్ లో ర‌వితేజ నుంచి ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ హీరోల వ‌ర‌కు ఈ ఫార్ములా వ‌ర్తిస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే యువ హీరో నాగశౌర్య ఒక్క సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తుండగా తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. నిజానికి నాని హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘వి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని. త్వరలో ‘టక్ జగదీష్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని నిన్నుకోరిలాంటి మంచి హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాతోపాటు ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సినిమాకు పది నుంచి పదకొండు కోట్లు అందుకున్న నాని ఈసారి ఏకంగా పద్నాలుగు కోట్లు కావాలంటున్నాడట. దానికి ఒక్క పైసా తక్కువైనా ఒప్పుకునేదే లేదని కరాఖండిగా చెప్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు