Home ప్రత్యేకం రెండో టెస్టుపై ప్రధాని మోదీ ట్వీట్ వైర‌ల్‌

రెండో టెస్టుపై ప్రధాని మోదీ ట్వీట్ వైర‌ల్‌

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇంట్రస్టింట్ మ్యాచ్’ అంటూ ఆ ట్వీట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. చెన్నైలోని కొన్ని ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన మోదీ.. చెన్నై చిదంబరం స్టేడియం మీదుగా వెళ్లారు. ఈ క్రమంలోనే చెపాక్ స్టేడియం ఫోటో తీసి ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చెన్నై స్టేడియంలో జరుగుతున్న హోరాహోరీ మ్యాచ్‌ను ఆకాశం నుంచి చూశాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే..ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ లో సత్తాచాటిన టీమిండియా.. ఇప్పుడు బంతితోనూ ఆదరగొట్టింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై పర్యాటక జట్టును 150 పరుగుల లోపే  కట్టడిచేసింది. టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడిన ఇంగ్లాండ్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రెండో రోజు ఆటలోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కాగా, టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(5/43)  తన మాయాజాలాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఇషాంత్‌ శర్మ(2/22), అక్షర్‌ పటేల్‌(2/40) కట్టుదిట్టంగా బంతులేయడంతో  తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు