ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. వై సీ పీ క్లీన్ స్వీప్ చేసింది.
75 మున్సిపల్ స్థానాలలో 71 స్థానాలలో వై సీ పీ ముందంజలో ఉంది. 11 కార్పొరేషన్లకు గాను 9 కార్పొరేషన్లలో ముందంజలో ఉంది.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూల్ లో వై సీ పీ గెలుపుతో మూడు రాజధానుల కు ఓటర్లు ఓటు ద్వారా అనుమతి ఇచ్చినట్టే.
తెలుగు దేశం పార్టీ అతి కష్టం మీద రెండు మున్సిపాలిటీలను గెలుచుకుంది. అవి ఒకటి మైదుకూరు కాగా, మరొకటి తాడిపత్రి. ఇంకా ఆశ్చర్యమేమంటే అమలాపురం లో జనసేన రెండవ స్థానం లో ఉంది.
ఇక్కడ ఉన్న ౩౦ మున్సిపాలిటీలలో అధికార వై సీ పీ 19 గెలుచుకోగా, జనసేన 6 గెల్చుకుంది. తెలుగు దేశం పార్టీ కేవలం 4 తో సరిపెట్టుకోగా, ఒకటి ఇండిపెండెన్స్ ఖాతాలోకి వెళ్ళింది.
ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికలలో, మున్సిపాలిటీ ఎన్నికలలో జనసేన ప్రభావం కనిపించిందని చెప్పాలి. ఒంటరి గా పోరాడితేనే జనసేన లాభపడేదేమో.