Home ప్రత్యేకం "రిప‌బ్లిక్" ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

“రిప‌బ్లిక్” ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌

‘చిత్రల‌హ‌రి’, ‘ప్రతిరోజూ పండ‌గే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ద‌ర్శకుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో సాయి తేజ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.
జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ పై డెబ్బై నాలుగేళ్లుగా ప్ర‌భుత్వం ఉంద‌న్న భ్ర‌మ‌లో బ్ర‌తుకుతున్నాం. కాని మ‌న‌కు ఆ ప్ర‌భుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియ‌దు అని రాసి ఉంది.
కాగా, ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్. దేవ్ కట్టా, కిరణ్ జయ్‌కుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు