మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఇటీవల చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి సీనియర్ నటి రమ్యకృష్ణ లుక్‌ని విడుదల చేశారు.
‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం’ అని భావించే రాజకీయ నాయకురాలి పాత్రలో విశాఖ వాణిగా రమ్యకృష్ణ ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించనుందని చిత్రబృందం తెలిపింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా కొత్తగా ఉంది. కాగా, ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. జగపతిబాబు, , సుబ్బరాజు కిలక పాత్రలు పోషిస్తుండగా రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన వంటి తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావులు కలిసి నిర్మిస్తున్న సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.