Home ప్రత్యేకం ‘రిపబ్లిక్‌’ మూవీ టీజర్‌ టాక్: పవర్‌ఫుల్‌ పాత్రలో దుమ్మురేపిన మెగా మేనల్లుడు..

‘రిపబ్లిక్‌’ మూవీ టీజర్‌ టాక్: పవర్‌ఫుల్‌ పాత్రలో దుమ్మురేపిన మెగా మేనల్లుడు..

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తన్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌4న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘రిపబ్లిక్‌’ టీజర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ నటన, డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్. దేవ్ కట్టా, కిరణ్ జయ్‌కుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ, రెహమాన్ పాటలు రాశారు. కథ, మాటలు, దర్శకత్వం దేవ్ కట్టా.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు