చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆచార్య చిత్రం మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో మెగాస్టార్ తర్వాతి సినిమా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్‌ని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ఏప్రిల్ 13 నుంచి సెట్స్ మీదకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి టైటిల్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చిత్రబృందం ఎలాంటి టైటిల్ చిరంజీవి 153 చిత్రానికి పెట్టబోతున్నారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈ సినిమాకు ‘రారాజు’ అన్న టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసినట్టు సమాచారం
కాగా, ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్, ఎన్వీ ఫిల్మ్స్, కొణిదెల ప్రొ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.