Home ప్రత్యేకం రామ్ చరణ్ సంచలన నిర్ణయం.. ఊహించని షాక్ లో శంకర్!

రామ్ చరణ్ సంచలన నిర్ణయం.. ఊహించని షాక్ లో శంకర్!

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కథ పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగనుందని  అంటున్నారు. అంతేకాదు మూవీ స్టోరీ తండ్రీ కొడుకుల కథ అని కూడ టాక్ ఉంది. ఇదిలాఉంటే.. హీరో రామ్ చరణ్ శంకర్ దర్శకుడు శంకర్ ను ఓ కోరిక కోరాదట. ఈ సినిమాలో కొడుకు పాత్రతో పాటు తండ్రి పాత్రను కూడ తానే చేస్తానని అన్నారట. దీంతో ఆలోచనలోపడిన శంకర్ రామ్ చరణ్ కు తండ్రి పాత్రకు లుక్ టెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారట. అందులో రామ్ చరణ్ గనుక ఓకే అనిపిస్తే తండ్రి, కొడుకు రెండు పాత్రలు చరణ్ తోనే చేయిస్తారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
కాగా, రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్స్ వేగంగా జరుగుతోంది. ఇవి పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ నేరుగా శంకర్‌ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు శంకర్‌ ‘భారతీయుడు2’ ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో వీలైనంత త్వరగా రామ్ చరణ్‌ సినిమాను మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు