Home ప్రత్యేకం రామ్ చరణ్ తో మరో రంగస్థలం ప్లాన్ చేస్తున్న సుకుమార్!

రామ్ చరణ్ తో మరో రంగస్థలం ప్లాన్ చేస్తున్న సుకుమార్!

ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక సుకుమార్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. కథ విషయంలో కూడా చర్చలు జరిగాయంటూ ఆ మద్య ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందింది. విజయ్ దేవరకొండ తో సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవితో సుకుమార్ సినిమా మొదలు పెట్టడం ఖాయం గా ఇండస్ట్రీలో కూడా టాక్ వినిపించింది. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవితో కంటే ముందు చరణ్ తో సుకుమార్ మూవీ ఉంటుందని అంటున్నారు.

రామ్ చరణ్ మరియు సుకుమార్ ల కాంబోలో ఇప్పటికే రంగస్థలం సినిమా వచ్చింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులనుఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తునన పుష్ప సినిమా పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇది కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి. రంగస్థలం తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చిన కారణంగా సుకుమార్ తదుపరి సినిమాలకు గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. జులై నుండి శంకర్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండతో సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి చేసి ఆ వెంటనే చరణ్ తో సుకుమార్ మరో రంగస్థలంను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆతర్వాత  చిరంజీవితో సుకుమార్ సినిమా ఉంటుంది అంటున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు