Home సినిమాలు రామ్ చరణ్ కోసం 'ఆచార్య' టీమ్ భారీ స్కెచ్..

రామ్ చరణ్ కోసం ‘ఆచార్య’ టీమ్ భారీ స్కెచ్..

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో, ఆయన తనయుడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్,మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.కాగా, ఈసినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌ కోసం పక్కాగా స్కెచ్చేసిన ‘ఆచార్య’ చిత్రయూనిట్ ఓ పాటను కూడా ప్లాన్ చేశారని సమాచారం. ఇందులో చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే మణిశర్మ ఈ సాంగ్ కూడా కంపోజ్ చేసి పెట్టారని, అతి త్వరలో కొరటాల శివ ఈ సాంగ్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నారని  సమాచారం.


కాగా,యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోనటుడు సోనూసూద్‌  ప్రతినాయకుడి లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నారు.మరోవైపు  రామ్‌చరణ్‌ ప్రస్తుతం భారీ పీరియాడికల్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం)లో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ స్వయంగా వెల్లడించింది. కాగా ఇందులో స్వాతంత్ర సమర యోధుడు  అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో వీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు