Home ప్రత్యేకం రామ్‌చరణ్‌-శంకర్ మూవీ: క్రేజీ అప్‌డేట్‌ ఇదే!

రామ్‌చరణ్‌-శంకర్ మూవీ: క్రేజీ అప్‌డేట్‌ ఇదే!

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అగ్ర దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఓ చిత్రంలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుథ్ ర‌విచంద్ర‌న్‌ను ఎంపిక చేసిన‌ట్టు గ‌తంలో వార్తలు రాగ.. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తమన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే పొలిటికల్‌ నేపథ్యంలో  రూపొందనున్న ఈ సినిమా  స్ర్కీప్ట్‌ కూడా సిద్ధం అయిపోయిందని సమాచారం.

ఇదిలాఉంటే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన వెంటనే మెగాపవర్ స్టార్ నేరుగా శంకర్‌ సినిమాలో నటించనున్నట్లు టాక్‌. ఇక మరోవైపు శంకర్‌ ‘భారతీయుడు2’  చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో రామ్ చరణ్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు.

 

 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు