Home సినిమాలు ‘రాపో 19’ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: పవర్ ఫుల్ పోలీస్​ ఆఫీసర్​గా రామ్!

‘రాపో 19’ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: పవర్ ఫుల్ పోలీస్​ ఆఫీసర్​గా రామ్!

ఇటీవలే ‘రెడ్’ మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు కమిటయ్యారు. తమిళ దర్శకుడు లింగుస్వామితో మూవీ చేయబోతున్నాడు రామ్. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడని సమాచారం.
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇక హీరో రామ్ ఇటీవల వరుస సినిమాలు చేస్తూ స్పీడ్‌ పెంచాడు. తన తొలి చిత్రం దేవదాసులో మాస్ యాంగిల్ పాత్రలో హిట్ అందుకున్న రామ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూశాడు. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌ వంటి పక్కా మాస్ మసాలా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తరువాత రెడ్ సినిమాతోనూ ప్రేక్షకులను అలరించిన రామ్ ఇప్పుడు మరో మాస్‌ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు