Home ప్రత్యేకం రానా 'అరణ్య' మూవీ రివ్యూ:

రానా ‘అరణ్య’ మూవీ రివ్యూ:

నటీనటులు : రానా దగ్గుబాటి,  విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ తదితరులు
నిర్మాతలు : ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ
దర్శకత్వం : ప్రభు సాల్మన్
సంగీతం : శాంతను మొయిత్రా
విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ.. బాలీవుడ్‌లోనే సొంత మార్గెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా ‘అరణ్య’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు పెంచేసిన రానా ‘అరణ్య’ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. అరణ్యగా రానా ఎలా నటించారు? అన్నది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
నరేంద్ర భూపతి అరణ్య(రానా దగ్గుబాటి)కు అడవులు, జంతువులు అంటే చాలా ఇష్టం. ఆయన తాత జయేంద్ర భూపతి 500 ఎకరాల అడవి ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసిచ్చెస్తే… ఆయన ఆ అడవికి, అక్కడి జీవులకు సంరక్షకుడిగా ఉంటాడు. లక్షకు పైగా చెట్లు నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫారెస్ట్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డు అందుకుంటాడు. అడవిలోనే ఉంటూ అక్కడి ఏనుగులకు, గిరిజనులకు అండగా ఉంటాడు. అందుకే, నరేంద్ర భూపతిని అక్కడి గిరిజన ప్రజలు అరణ్యగా పిలుచుకుంటారు.

ఇదిలా ఉంటే.. అరణ్య సంరక్షకుడిగా ఉన్న అటవీ ప్రాంతంలో భారీ టౌన్‌షిప్ నిర్మించడానికి కేంద్ర అటవీ శాఖా మంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) ప్రయత్నిస్తూ ఉంటాడు. దీని కోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలనుకుంటాడు. దీనిని  అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? అనేదే మిగ‌తా చిత్ర క‌థ‌.
విశ్లేషణ:
మానవుల స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథే ‘అరణ్య’. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇది ప్రకృతి విలువేంటో చెప్పే పదునైన కథాంశం. కానీ, ఆ పదును కథనంలో కనిపించలేదు. కథను గొప్పగా రాసుకున్న దర్శకుడు ప్రభు సాల్మన్.. కథనంలో మాత్రం బలం లేకుండా చేశారు. ఇక ఆరణ్య పాత్రలో రానా ఒదిగిపోయాడు.  అరణ్య పాత్ర కోసం రానా పడిన కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది. అడవి మషినిలా ఉండే అరణ్య పాత్రలో రానా జీవించేశాడు. సింగ పాత్రకు విష్ణు విశాల్‌ న్యాయం చేశాడు. విలేకరిగా శ్రీయా పింగోల్కర్‌, నక్సలైట్‌గా జోయా హుస్సేన్ పాత్రల నిడివి తక్కువే అయినా.. పర్వాలేదనిపించారు. ఇక ప్రతినాయకుడి పాత్రలో మహదేవన్‌ ఒదిగిపోయాడు.  ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం శాంతను మొయిత్రా సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. థాయిలాండ్ అడవులను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు సినిమాటోగ్రాఫర్ ఎ.ఆర్. అశోక్ కుమార్. ఆయన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్: కథ, రానా నటన, నేపథ్య సంగీతం
మైనస్‌ పాయింట్స్‌: కథనం, సాగదీత సీన్లు
రేటింగ్: 2.5/5

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు