Home సినిమాలు రానా ‘అరణ్య’ ట్రైలర్‌ వచ్చేసింది

రానా ‘అరణ్య’ ట్రైలర్‌ వచ్చేసింది

‘బాహుబలి’ తరవాత రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమాలో భళ్లాలదేవుడిగా ఆయన నటన జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు ఆయన హిందీ సినిమాల్లోనూ నటిస్తుండటంతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే, ఆయనతో బహుభాషా చిత్రాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రానా చేసిన బహుభాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ఇది తెలుగులో ‘అరణ్య’ అనే టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. “ఏనుగులు మనకంటే ఎంతో తెలివైనవి. ఎంతో భావోద్వేగం కలవి..”అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ఇందులో కొంతమంది తమ స్వార్థం కోసం ఏనుగులను బంధించిన తర్వాత ‘అయ్యో..! ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిందే’ అంటూ రానా పలికిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. 

ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీని తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్రపంచ‌వ్యాప్తంగా మార్చి 26న‌ విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు ప్రక‌టించారు. ఈ మూవీలో తమిళ హీరో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియ పిల్గావోంక‌ర్ కీల‌క పాత్రలు పోషించారు. శంత‌ను మొయిత్రా సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. తెలుగులో వనమాలి మాటలు, పాటలు రాశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు