Home సినిమాలు రానాతో సాయిపల్లవి 'కోలు.. కోలు'.. ఆక‌ట్టుకుంటున్న లిరిక‌ల్ వీడియో సాంగ్

రానాతో సాయిపల్లవి ‘కోలు.. కోలు’.. ఆక‌ట్టుకుంటున్న లిరిక‌ల్ వీడియో సాంగ్

‘కోలు కోలుమ్మా.. కోలు కోలు నా సామి.. మనసే మేలు కొని చూసే.. కలలో నిండిన వాడే..’ అంటూ సాయిపల్లవి హుషారుగా స్టెప్పేశారు. రానా సరసన నటిస్తున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవిపై తీసిన సోలో సాంగ్‌ ఇది. వేణు ఊడుగుల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కోలు కోలు..’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ వీడియోను టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌ విడుదల చేశారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, దివ్య మాలికా, సురేశ్‌ బొబ్బిలి ఆలపించారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయని పాత్రలను రానా, సాయిపల్లవి చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్‌  చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్‌ లోపెజ్, దివాకర్‌ మణి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూ సర్‌: విజయ్‌కుమార్‌ చాగంటి

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు