Home ప్రత్యేకం రానాకి ఊహించని షాక్.. ఆగిపోయిన 'అరణ్య'

రానాకి ఊహించని షాక్.. ఆగిపోయిన ‘అరణ్య’

దగ్గుబాటి రానా టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెరకెక్కించింది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్‌’ పేర్లతో రూపొందింది. జోయా హుస్సేన్‌, శ్రియా పిల్లావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత రసూల్‌  సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. కాగా..టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు పెంచేసిన రానా ‘అరణ్య’ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే రానాకి ఊహించని షాక్ తగిలింది.
అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ‘అరణ్య’ హిందీ వెర్షన్ విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ‘ప్రేక్షకులతో ఈ వార్తను పంచుకోవడం బాధాకరం. కొవిడ్‌19 మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ‘హాథీ మేరీ సాథీ’ (అరణ్య హిందీ వెర్షన్) విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం అని చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు