Home సినిమాలు 'రాధేశ్యామ్': ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్స్ సిద్ధం చేస్తున్న ప్రభాస్!

‘రాధేశ్యామ్’: ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్స్ సిద్ధం చేస్తున్న ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో  ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా, ‘రాధేశ్యామ్’ చిత్రం నుంచి వరసగా సర్‌ప్రైజెస్‌కి ప్లాన్ చేశారట చిత్రబృందం. దాంతో ఫ్యాన్స్ కి ఇక పండుగే అని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ప్రభాస్ రాధేశ్యామ్ జోరు మొదలవబోతోందట. ఏప్రిల్‌లో రెండు టీజర్స్‌తో పాటు ఒక్కో పాటని విడుదల చేస్తూ వస్తారని సమాచారం. ఏప్రిల్ మొత్తం ఈ సర్‌ప్రైజెస్ ఉండేలా ప్లాన్ చేశారట రాధేశ్యామ్ మేకర్స్. ఇక సినిమా ట్రైలర్‌ని మేలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో  జూలై 30న ఈ సినిమా రిలీజ్‌  చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే  ప్రకటించింది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు