Home సినిమాలు ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది..దుమ్ములేపిన రెబల్ స్టార్..

‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది..దుమ్ములేపిన రెబల్ స్టార్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్‌కి చేరుకుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

కాగా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు పునర్జన్మల నేపథ్యంలో ఈ మూవీ కథ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు