Home సినిమాలు 'రాధేశ్యామ్‌' క్రేజీ అప్‌డేట్.. కీలక పాత్రలో కృష్ణం రాజు

‘రాధేశ్యామ్‌’ క్రేజీ అప్‌డేట్.. కీలక పాత్రలో కృష్ణం రాజు

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించనుందన్నదే ఆ వార్త..బుధవారం 81వ పుట్టిన రోజు జరుపుకున్న కృష్ణం రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహాజ్ఞానిగా పరమ హంస పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అందుకోసమే గడ్డం పెంచుతున్నానని తెలిపారు. తన పాత్రతో పాటు ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తైందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కాగా,ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’‌ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.  పీరియాడికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతానని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన  పూజ హేగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు