Home ప్రత్యేకం ‘రాధేశ్యామ్‌’ ఓవర్సీస్ బిజినెస్.. మరోసారి సత్తా చాటిన ప్రభాస్!

‘రాధేశ్యామ్‌’ ఓవర్సీస్ బిజినెస్.. మరోసారి సత్తా చాటిన ప్రభాస్!

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఇంకా కొంత చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. అయితే అది ఇంకా పూర్తి కాకుండానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వ్యవహారాలు జరిగిపోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అలా ప్రస్తుతం ఓవర్సీస్ బిజినెస్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం అక్కడి థియేట్రికల్ హక్కుల కోసం పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడి బిజినెస్ 3.5 మిలియన్ డాలర్స్ నుంచి 4 మేర జరగనున్నట్టుగా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. కాగా, యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డాక్టర్‌ ప్రేరణ పాత్రలో కనిపిస్తారు పూజా హెగ్డే. అలాగే ప్రముఖ కార్ల కంపెనీ యజమాని విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు