Home క్రీడలు రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం – అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు ప్రారంభమైన మూడవది మరియు డే అండ్ నైట్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 112 పరుగులకే కుప్ప కూలింది. 

ఇషాంత్ వికెట్ల ఖాతా ప్రారంభించితే అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలం తో 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు.  అశ్విన్ 3 వికెట్లు తీశాడు.  అక్షర్ పటేల్, అశ్విన్ ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ను కుదురుకోనివ్వలేదు.  ఓపెనర్ క్రాలే 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ.  భారత్ 99/3

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.  ౩4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూడవ వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

ఈ భాగస్వామ్యాన్ని విరాట్ ని అవుట్ చేయడం ద్వారా లీచ్ విడదీశాడు.  గిల్ 11 పరుగులకు అవుట్ కాగా, పుజారా డక్ ఔట్ అయ్యాడు.  విరాట్ 27 పరుగులు చేసి మొదటి రోజు ఆఖరి ఓవర్ లో ఔట్ అయ్యాడు  రోహిత్ 57 పరుగులతోను రహానే ఒక్క పరుగుతోను క్రీజ్ లో ఉన్నారు.   ఇంగ్లాండ్ బౌలర్ లలో లీచ్ రెండు వికెట్లు, ఆర్చర్ ఒక వికెట్ తీసుకున్నారు

భారత్ ఇంకా 13 పరుగులు వెనుకబడి ఉంది ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు.  ఇంకా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.  హిట్ మాన్ రోహిత్ క్రీజ్ లో ఉన్నాడు.  200 పరుగుల ఆధిక్యం తెచ్చుకో గలిగితే భారత్ ఈ మ్యాచ్ ని చేతుల్లోకి తీసు కున్నట్లే. 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు