Home సినిమాలు రవితేజ బర్త్‌డే సర్‌ప్రైజ్‌: 'ఖిలాడి' ఫ‌స్ట్ గ్లింప్స్ అదుర్స్

రవితేజ బర్త్‌డే సర్‌ప్రైజ్‌: ‘ఖిలాడి’ ఫ‌స్ట్ గ్లింప్స్ అదుర్స్

ఇటీవలి కాలంలో సరైన సక్సెస్‌లేక డీలాపడిన రవితేజ ‘క్రాక్’ సినిమాతో ట్రాక్ ఎక్కేశారు. మాస్ మహారాజ్ గత సినిమాల్లో ‘రాజా ది గ్రేట్’ తర్వాత ”టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా” వంటి సినిమాలు ఆశించిన స్థాయి రిజల్ట్ రాబట్టకపోవడంతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఈ ‘క్రాక్’తోనైనా తిరిగి రవితేజ సత్తా చాటుతాడా? అని ఎదురుచూసిన ఆయన అభిమానులకు క్రాకింగ్ రిజల్ట్ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నారు రవితేజ. ఇప్పుడు ఇదే జోష్ లో తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ మొదలు పెట్టేశాడు. రమేశ్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
కాగా,రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ‘ఖిలాఢి’ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. స్టైలిష్‌ లుక్‌లో రవితేజ పెద్ద సుత్తి పట్టుకుని నడుస్తున్నట్లు గ్లింప్స్‌ వీడియోలో ఉంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ  సినిమాను ఈ ఏడాదిస‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు