Home సినిమాలు రవితేజ దూకుడు మామూలుగా లేదుగా.. మరో యువ దర్శకుడికి అవకాశం!

రవితేజ దూకుడు మామూలుగా లేదుగా.. మరో యువ దర్శకుడికి అవకాశం!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజకు ‘క్రాక్’ మూవీ రూపంలో ఓ భారీ హిట్ దక్కిందనే చెప్పాలి. ఇలా హిట్‌ పడిందో లేదో.. వెంటనే వరుస సినిమాలతో కేరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ మాస్ మహారాజ. ప్రస్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రవితేజ ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. అలాగే శరత్‌ మండవ దర్శకత్వంలోనూ నటించనున్నాడు.

ఇదిలా ఉంటే.. అడివి శేష్‌-మంచు లక్ష్మీ కాంబోలో వచ్చిన ‘దొంగాట’ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీకృష్ణ డైరెక్షన్ లో రవితేజ నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వంశీకృష్ణ.. రవితేజను కలిసి ఓ స్టోరీ వినిపించగా.. వెంటనే ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక మరోవైపు రవితేజ నటిస్తున్న తాజా సినిమా ‘ఖిలాడి’ దర్శకుడు రమేష్‌ వర్మకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దింతో షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కాగా, ఇందులో డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు