రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ , ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేస్తున్నారు.‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్ . రమేష్ వర్మ దర్శకత్వంలో డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సత్యనారాయణ కోనేరు నిర్మాత.
కాగా, ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఇటలీ షెడ్యూల్ దాదాపు పూర్తయ్యే సమయంలో చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది. ఇటలీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ‘ఖిలాడి’ సినిమా షూటింగ్‌కు అనుమతులను నిలిపివేసిందట. దాంతో చిత్రయూనిట్ అయోమయంలో పడిందని సమాచారం. కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకూ కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్‌ను పూర్తి చేసుకుని వస్తారా? లేక మిగిలిన చిత్రీకరణను ఇక్కడి లొకేషన్స్‌లో షూటింగ్స్ చేస్తారా? అనేది చూడాలి. ఈ సినిమా మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.