Home సినిమాలు ‘రంగ్ దే’ 4 డేస్ కలెక్షన్స్: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యూత్ స్టార్ నితిన్

‘రంగ్ దే’ 4 డేస్ కలెక్షన్స్: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యూత్ స్టార్ నితిన్

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 26వ తేదీన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రంగ్ దే’తో ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. నితిన్- కీర్తి సురేష్ జంటగా వచ్చిన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన రంగ్ దే తొలి మూడు రోజుల్లో 12 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు హోలీ కావడం.. సెలవు దినం రావడంతో చక్కటి వసూళ్లనే సాధించింది ఈ చిత్రం.

నాలుగో రోజు దాదాపు 1.56 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ‘రంగ్ దే’. తొలిరోజు 5.43 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం..రెండు, మూడు, నాలుగు రోజులు కూడా మంచి వసూళ్లను సాధించింది. మొత్తంగా ‘రంగ్ దే’ చిత్రం ఇప్పటి వరకు 13.85 కోట్ల షేర్ వసూలు చేసింది.

‘రంగ్ దే’ ప్రాంతాలవారిగా 4 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ పరిశీలిస్తే..
★ నైజాం: 4.65 కోట్లు
★ ఉత్తరాంధ్ర: 1.51 కోట్లు
★ సీడెడ్: 1.76 కోట్లు
★ ఈస్ట్ గోదావరి: 92 లక్షలు
★ వెస్ట్ గోదావరి: 66 లక్షలు
★ గుంటూరు: 1.20 కోట్లు
★ కృష్ణా: 60 లక్షలు
★ నెల్లూరు: 46 లక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4 రోజుల మొత్తం వసూళ్లు: 11.55 కోట్లు (18.22 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 68 లక్షలు, ఓవర్సీస్: 1.62 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ‘రంగ్ దే’ చిత్రం 4 రోజుల మొత్తం కలెక్షన్స్ : 13.85 కోట్లు (23.60 కోట్ల గ్రాస్)

 

 

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు