Home ప్రత్యేకం `రంగ్ దే` ట్రైల‌ర్ టాక్‌: ‘మనల్ని ప్రేమించే వాళ్ల విలువ.. వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’

`రంగ్ దే` ట్రైల‌ర్ టాక్‌: ‘మనల్ని ప్రేమించే వాళ్ల విలువ.. వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవలే ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకుకొచ్చిన సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశాలను ఎంచుకొని వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ఆయన మార్చి 26న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రంగ్ దే’ సినిమాతో వెండితెరపై అలరించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై రూపొందిన ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ‘గివ్ మీ స‌మ్ ల‌వ్‌’ అనే ఆసక్తికర ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ రంగ్ దే మూవీ నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన అన్ని సినిమా అప్‌డేట్స్ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి. 

తాజాగా ఈ శుక్రవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం నవ్వులు పంచుతూ ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘మనల్ని ప్రేమించే వాళ్ల విలువ.. మనం వాళ్లను వద్దనుకున్నప్పుడు కాదు.. వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పీవీడీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 26న ‘రంగ్‌దే’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు