Home సినిమాలు 'రంగ్ దే' కలెక్షన్స్: నితిన్ కు గట్టి ఎదురుదెబ్బ..

‘రంగ్ దే’ కలెక్షన్స్: నితిన్ కు గట్టి ఎదురుదెబ్బ..

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ కలెక్షన్స్ విషయంలో మళ్లీ వెనుకబడింది. ఇటీవలే ‘చెక్’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నితిన్.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో తిరిగి ట్రాక్ ఎక్కినట్లు కనిపించినా.. మరోసారి నితిన్ కు నిరాశే ఎదురైంది. భారీ అంచనాల నడుమ మార్చి 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ సొంతం చేసుకుంది. దింతో తొలి మూడు రోజుల్లో రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అయితే నాలుగో రోజు హోలీ సెల‌వు రావడంతో కోటిన్నరకు పైగా షేర్ వసూలు చేసింది. కాగా, ఐదో రోజు మాత్రం ఈ సినిమా జోరుకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు రంగ్ దే మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.12.67 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.15 కోట్లకు చేరువలో షేర్ వచ్చింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.9 కోట్లు వసూలు చేయాలి. అలా చేస్తే కానీ నితిన్ హిట్ కొట్టలేడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాకు అన్ని కోట్లు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల రంగ్ దే కలెక్షన్స్ గణనీయంగా పడిపోయాయి. తొలి 4 రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి తగ్గుముఖం పట్టింది. వీకెండ్ లో మళ్ళీ జోరు చూపిస్తే చేస్తే తప్ప ఈ సినిమా సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లడం కష్టంగా కనిపిస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు