Home సినిమాలు ‘రంగ్‌దే’ ప్రీ రిలీజ్ బిజినెస్: నితిన్ మూవీ ముందు భారీ లక్ష్యం..!

‘రంగ్‌దే’ ప్రీ రిలీజ్ బిజినెస్: నితిన్ మూవీ ముందు భారీ లక్ష్యం..!

నితిన్‌, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా వస్తున్న మూవీ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌  చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నైజాం ఏరియాకు గాను రూ.7.6 కోట్లు.. సీడెడ్ లో రూ.3.6 కోట్లు… ఆంధ్రాలో రూ.10 కోట్లు ఇతర ప్రాంతాల్లో రూ.2.7 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా దాదాపుగా 23 కోట్ల బిజినెస్ ను చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలంటే రూ.24 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంది. ఈ సినిమాకు రానా ‘అరణ్య’ సినిమాతో గట్టి పోటీనే ఉంది. కనుక రంగ్ దే సినిమా అంత భారీ మొత్తంను వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా సూపర్ హిట్ అయితే తప్ప బ్రేక్ ఈవెన్ కాదేమో అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా.. గతంలో నితిన్-రష్మిక మండన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన ‘చెక్‌’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్‌ ‘రంగ్‌దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్‌ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నితిన్‌కు ఇది హిట్‌ను ఇస్తుందా లేదా అనేది మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు