Home ప్రత్యేకం యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘పుష్ప’రాజ్..!

యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘పుష్ప’రాజ్..!

వెండితెరపై కలెక్షన్ల వర్షం కురిపించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యూట్యూబ్‌లోనూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ ‘పుష్ప’ టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. అదేంటి సినిమానే రిలీజ్ కాలేదు కదా అంటారా.. మేం చెప్పేది టీజర్ గురించి. పుష్ప టీజర్ వీడియో.. రెండు రోజుల్లో 30 మిలియన్స్ వ్యూస్ రాబట్టగా.. ఇప్పటికి అంటే పదకొండు రోజుల్లో 44మిలియన్స్ వ్యూస్ తో పాటు 1.2మిలియన్ లైక్స్ దక్కించుకొని ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వీడియోగా పుష్పారాజ్ వీడియో రికార్డు దక్కించుకుంది. అయితే ఇప్పటికి యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో పుష్పారాజ్ అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇక యూట్యూబ్‌లో బన్నీ జోరు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో పుష్ప టీజర్‌కు వస్తున్న స్పందనను చూసి ఆయన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

ఇదిలాఉంటే.. అల్లు అర్జున్‌, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు