Home క్రీడలు యువతకు శుభవార్త.. తెలంగాణలో ధోని క్రికెట్‌ అకాడమీ

యువతకు శుభవార్త.. తెలంగాణలో ధోని క్రికెట్‌ అకాడమీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్‌ ధోని మరికొన్ని రోజుల్లో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్‌ అకాడమీలు ప్రారంభించబోతున్నాడు. ఎంఎస్‌ ధోని క్రికెట్‌ అకాడమీ పేరుతో ప్రారంభంకానున్న ఈ అకాడమీలను ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, బ్రెయినియాక్స్‌ బీ అనే సంస్థలు సంయుక్తంగా ప్రారంభించేందుకు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాబోయే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 15 అకాడమీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్కా స్పోర్ట్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, భారత మాజీ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు సభ్యుడు మిహిర్ దివాకర్ వెల్లడించారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ కెరీర్‌ ప్రారంభంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో తెలంగాణతో పాటు  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దివాకర్‌ వెల్లడించారు. కాగా, ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ కోచింగ్‌ డైరెక్టర్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ డారెల్‌ కలినన్‌ కొనసాగుతున్నారు. భారత్‌లో ఇప్పటికే 50కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో మూడింటిని ప్రారంభించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు