Home సినిమాలు యంగ్ 'నార‌ప్ప'గా స్ట‌న్నింగ్ లుక్ తో శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపిన వెంక‌టేష్

యంగ్ ‘నార‌ప్ప’గా స్ట‌న్నింగ్ లుక్ తో శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపిన వెంక‌టేష్

గతకొంతకాలంగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు హీరో విక్టరీ వెంకటేష్‌. ఆయన నటించిన తమిళ బ్లాక్‌బస్టర్‌ మూవీ అసురాస్‌ రీమేక్‌గా తీసిన ‘నారప్ప’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని మే 14 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కులని ఎంత‌గానో ఆకట్టుకుంది.

అయితే, తాజాగా..మ‌హా శివ‌రాత్రి ప‌ర్వదినం సంద‌ర్భంగా మూవీ నుండి మ‌రో లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఇందులో వెంకటేష్ యంగ్ లుక్‌లో ఫిదా చేస్తున్నారు. ఇదిలావుంటే.. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం దృశ్యం రీమేక్‌లోనూ వెంకటేష్‌ నటిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మోహన్‌లాల్‌ హీరోగా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం-2’ ఓటీటీలో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు