Home సినిమాలు మ‌హేష్-తమన్నా క‌ల‌యిక‌.. షూటింగ్‌ ఫోటోలు వైరల్‌

మ‌హేష్-తమన్నా క‌ల‌యిక‌.. షూటింగ్‌ ఫోటోలు వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా ఇద్దరూ కలిసి మరోసారి కెమెరా ముందుకు అడుగుపెట్టారు. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఆగడు’ సినిమాలో కలిసి నటించిన ఈ జోడీ.. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ సాంగ్‌తో ఆకట్టుకున్నారు. ఆ రెండు సందర్భాల్లో ఈ ఇద్దరి జోడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరినీ సెట్స్ మీదకు తీసుకువచ్చాడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

అయితే మహేష్ బాబు, తమన్నా కలిసి చేసేది సినిమా కాదు యాడ్ షూట్. హవెల్స్‌ ఎలక్ట్రిక్‌ బల్బుల యాడ్‌లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ యాడ్‌ను ప్రత్యేకంగా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగా షూట్ చేయడం విశేషం. అయితే తాజాగా షూటింగ్ లొకేష‌న్ లో మ‌హేశ్‌, త‌మ‌న్నా, సందీప్‌రెడ్డి, సెల‌బ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్ అవినాష్ గోవారిక‌ర్ ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మ‌హేశ్‌కు సందీప్ సీన్ వివ‌రిస్తున్న‌ట్టుగా ఉన్న స్టిల్ వైర‌ల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉండ‌గా..త‌మ‌న్నా సీటీమార్ చిత్రంతో బిజీగా ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు